అయ్యో.. చికెన్‌ గొడవ ఎంతపని చేసింది!

24 Jun, 2020 15:54 IST|Sakshi

డిస్పూర్‌: ఇంట్లో భర్త మాంసాహరం వండించడంతో గొడవపడ్డ అనంతరం కొత్తజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యభర్తలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇసా‌నగర్‌ పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ‘లఖింపూర్‌కు చెందిన గురు దయాళ్‌(22), రేష్మా(19)ను జూన్‌ 19న వివాహం చేసుకున్నాడు. రేష్మా వెజిటేరియన్‌ కావడంతో తన భర్త సోమవారం చికెన్‌ తీసుకువచ్చి తల్లికి వండమని ఇచ్చాడు. అది చూసిన రేష్మా ఇంట్లో చికెన్‌ వండటానికి వీలు లేదని, బయట వండుకొమ్మని భర్తకు చెప్పింది. అయినా అతడు వినిపించుకోకుండా ఇంట్లోనే వండమని తన తల్లికి చెప్పాడు. (ఆన్‌లైన్ చదువు: స్మార్ట్‌ ఫోన్‌ లేదని.. )

దీంతో రేష్మా అతడిని నిలదీయడంతో ఇద్దరూ గొడవడ్డారు. అనంతరం రాత్రి ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని చూసిన గురుదయాళ్‌ తండ్రి శివనాథ్‌ ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ రేష్మా మరణించింది. ప్రస్తుతం గురుదయాళ్‌ పరిస్థితి విషయంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇసానగర్‌ పోలీస్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ సునిల్‌ సింగ్‌ మాట్లాడుతూ... రేష్మాకు, గురుదయాళ్‌కు ఇటీవల వివాహం జరిగిందని చెప్పారు. సోమవారం రాత్రి ఇంట్లో నాన్‌వెజ్‌ వండొద్దని గొడవ పడిన అనంతరం భార్యభర్తలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించగా భార్య రేష్మా మృతిచెందగా.. భర్త గురుదయాళ్‌ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని, గురుదయాళ్ ఆరోగ్యం మెరుగుపడ్డాక అతడి స్టేట్‌మెంట్‌ తీసుకున్నాకే కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు