2 వేల రూపాయల నోటుపై క్లారిటీ

17 Mar, 2020 07:43 IST|Sakshi

ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘రూ.2 వేల నోట్ల ముద్రణ ఆపే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని వివరించారు. ‘రూ.2 వేల నోట్లకు చిల్లర కొరతతో వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో, రూ.500, రూ.200 నోట్లుంచేందుకు ఏటీఎంలను సిద్ధం చేయాలని ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌ తమ అధికారులను ఆదేశించాయి’ అని వివరించారు.  

చారిత్రక కట్టడాల్లో చోరీలు
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీ ఆనందవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న నంది విగ్రహం, కర్ణాటకలోని సదాశివస్వామి గుడిలో రాగి కలశం చోరీకి గురయ్యాయని  సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ లోక్‌సభకు తెలిపారు. రక్షిత చారిత్రక కట్టడాల వద్ద 280 మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులకు అనుమతులిచ్చినట్లు చెప్పారు. (చదవండి: కమల్‌ను కాపాడిన ‘కరోనా’)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు