‘స్వచ్ఛ’ రాయబారిగా పాక్‌ చిన్నారి.. దుమారం

5 May, 2018 10:09 IST|Sakshi

పట్నా: స్వచ్ఛ భారత్‌లో భాగంగా బిహార్‌లో అధికారులు రూపొందించిన ఓ బుక్‌లెట్‌ వివాదాస్పదంగా మారింది. జముయి జిల్లాలో ‘స్వచ్ఛ జముయి స్వస్త్‌ జముయి’ నినాదంతో కార్యక్రమాలను అధికారులు కొనసాగిస్తున్నారు. ఇందు కోసం రూపకల్పన చేసిన బుక్‌లెట్‌ కవర్‌ పేజీపై బ్రాండ్‌ అంబాసిడర్‌గా పాకిస్థాన్‌కు చెందిన బాలిక ఫోటోను ముద్రించారు. శుక్రవారం ఈ విషయం వెలుగులోకి రాగా.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో చిత్రంలో ఆ చిన్నారి పాక్‌ జెండాను గీసినట్లు ఉండటంతో వివాదం మరింత ముదిరింది. పైగా ఆ బాలిక పాక్‌ తరపున యూనిసెఫ్‌కు ప్రచారకర్త అని తెలిసింది. దీంతో స్థానికులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. అయితే ముద్రణ సంస్థ పొరపాటు మూలంగానే ఇది జరిగిందని అధికారులు చెప్పారు. బుక్‌లెట్‌లను వెనక్కి రప్పించి తప్పు సరిదిద్దుకుంటామని వారంటున్నారు. 

>
మరిన్ని వార్తలు