అయోధ్య విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని పిటిషన్‌

11 Sep, 2019 17:54 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : అయోధ్య కేసులో రోజువారీ చేపడుతున్న విచారణను ప్రత్యక్షప్రసారం చేయాలంటూ బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 16న విచారించనుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త కె.ఎన్‌ గోవిందాచార్య తరపున మాజీ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ వికాస్‌ సింగ్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా, అయోధ్యలోని రామ జన్మభూమి వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని మధ్యవర్తిత్వం వహించేందుకు నియమించింది. ఆ కమిటీ పరిష్కార మార్గాలను సూచించడంలో విఫలమవడంతో సుప్రీం కోర్టే రోజువారీ విచారణను చేపడతానని ప్రకటించింది. ఇందుకోసం జస్టిస్‌ ఎస్‌ఎ బోబ్డే, డివై చంద్రచూడ్‌, అశోక్‌ భూషణ్‌, ఎస్‌ఎ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 

మరిన్ని వార్తలు