మోదీ కొత్త విమానం వచ్చేదప్పుడే!

8 Jun, 2020 17:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానాల లిస్ట్‌లో మరో రెండు అత్యాధునిక విమానాలు చేరనున్నాయి. ప్రధాని సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న రెండు బోయింగ్‌-777 విమానాలను ఏర్పాటు చేయనుంది.  ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రయాణిండం కోసం కూడా  ఈ విమానాలను ప్రభుత్వం వినియోగించనుంది.  ఈ ఏడాది జూలై నుంచి ఇవి అందుబాటులోకి రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ విమానాల డెలివరీ ఆలస్యం అయ్యింది. దీంతో ఈ విమానాలు సెప్టెంబర్‌ నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విమానాలు అందుబాటులోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీ ఇక నుంచి అమెరికా బోయింగ్‌ సంస్థ రూపొందించిన బోయింగ్‌ 777 ఎయిర్‌ క్రాఫ్ట్‌లో ప్రయాణించనున్నారు. (ఇకఆరోగ్య సేతుబాధ్యత వారిదే..)

ఇప్పటి వరకు ప్రధాని ప్రయాణించే విమానం బోయింగ్‌ 747 ను ఎయిర్‌ఇండియా ఫైలట్లు నడుపుతుండగా బోయింగ్‌ 777 విమానాలను మాత్రం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైలెట్లు నడపనున్నారు. ఇప్పటికే ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఆరుగురు పైలట్లకు B777 విమానం నడపడంపై శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా వస్తున్న ఈ విమానాల మెయింటెయినెన్స్‌ను ఎయిరిండియాకు అనుబంధ సంస్థగా ఉన్న ఎయిరిండియా ఇంజినీరింగ్‌  సర్వీసెస్ లిమిటెడ్‌ తీసుకుంటుంది.  ఇక ఈ విమానం ప్రత్యేకతల విషయానికి వస్తే ఇందులో మిస్సైల్ వ్యవస్థ ఉంది. ప్రధాన మంత్రికి మరింత రక్షణను ఇచ్చేలా లార్జ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కౌంటర్‌ మెజర్స్‌, సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ సూట్స్‌ ఉన్నాయని అమెరికా బోయింగ్‌ సంస్థ తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రెండు ఎయిర్‌ క్రాఫ్ట్‌లను 190 మిలియన్ డాలర్లకు భారత్‌కు అమ్మేందుకు అమెరికాతో ఒప్పందం జరిగింది. (‘6 రోజులుగా అక్కడ ఒక్కరు మరణించలేదు)

మరిన్ని వార్తలు