రైల్వే ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు

17 Jun, 2018 03:52 IST|Sakshi

న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుతం ఇస్తున్న మెడికల్‌ కార్డులకు బదులుగా హెల్త్‌కార్డులను జారీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. విశిష్ట గుర్తింపు సంఖ్యతో దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా క్రెడిట్‌ కార్డు తరహాలో అందజేయనుంది.  రైల్వే బోర్డు  ఉత్తర్వుల ప్రకారం.. యూనిక్‌ ఐడీ నంబర్‌ ఉన్న హెల్త్‌ కార్డులను ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ‘ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులకు హెల్త్‌ కార్డులను అందజేయాలని నిర్ణయించాం. ఇవి డెబిట్, క్రెడిట్‌ కార్డుల తరహాలో ఉంటాయి.  కేటగిరీని బట్టి కలర్‌ ఉంటుంది. వీటి కాల పరిమితి ఐదేళ్లు’అని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది.

>
మరిన్ని వార్తలు