భారీ వరద.. నేలమట్టమైన ఇల్లు

19 Jul, 2020 16:03 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతాలకుతలం చేస్తున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.వరద బీభత్సానికి ఢిల్లీలోని స్లమ్ ఏరియాలో ఇళ్లు కొట్టుకుపోయాయి.కుండపోతగా కురిసిన వర్షానికి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, వరద నీటిలో తేలియాడాతు ఒక మృతదేహం కొట్టుకుపోయింది. మరొకవైపు అన్నానగర్‌లోని ఐటీవో సమీపంలో ఒక ఇళ్లు వరద తాకిడికి నేలమట్టమైంది. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

 భారీ వర్షానికి ఆదంపూర్‌, హిస్సార్‌, హన్సి, జింద్‌, గోహానా, గనౌర్‌, బరూత్‌, రోహ్‌తక్‌, సోనిపట్‌, బాగ్‌పాట్‌, గురుగ్రామ్‌, నొయిడా, ఘజియాబాద్‌, ఫరిదాబాద్‌ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఢిల్లీ వర్షం దంచి కొడుతోంది. సఫ్దార్‌గంజ్ ప్రాంతంలో 4.9 మి.మీ. వర్షపాతం నమోదుకాగా,  పాలెం ప్రాంతంలో 3.8 మి.మీ. వర్షం కురిసింది. వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అప్పటికే చాలా మంది ఆ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.  మరో రెండు రోజులపాటు ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఢిల్లీ, హరియాణ, చండీగఢ్‌ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది.

మరిన్ని వార్తలు