జీవుడే దేవుడు

4 Feb, 2015 01:35 IST|Sakshi
జీవుడే దేవుడు

బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరాచార్యులు ‘అస్త్యాత్మా జీవాఖ్యః శరీరేంద్రియ పంజరాధ్యక్షః కర్మఫల సంబం ధీ’ అన్న వాక్యం రాశారు. అస్తి ఆత్మా జీవ ఆఖ్యః శరీర ఇంద్రియ పంజర అధ్యక్షః కర్మఫల సంబంధీ అన్నది ఈ వాక్య పద విభాగం. అస్తి ఆత్మా, ఆత్మ అనేది ఒకటి ఉంది. అది జీవుడు అన్న పేరుతో ఉంది. ఆ జీవుడు శరీ రేంద్రియాలు అన్న పంజరంలో అధ్యక్షుడై ఉన్నాడు. సరే, అన్ని శరీరాల్లో ఒక్క ఆత్మే ఇన్ని జీవులుగా ఉంటే, జీవవైవిధ్యానికి కారణమేమిటి? అన్న ప్రశ్నకు కర్మ ఫలం సంబంధమే అన్నది సమాధానం.
 
 ఇప్పుడు ఇదే వాక్యాన్ని వెనక నుండి పరిశీలి ద్దాం. కర్మఫల సంబంధం వల్ల ఆత్మకే జీవభ్రాంతి కలుగుతుంది. కర్మఫల పరిత్యా గంచే జీవభ్రాంతి తొలగుతుంది. భ్రాంతి తొలగితే శరీరం, ఇంద్రి యాలు అన్న పంజరం ప్రాప్తిం చదు. అప్పుడు జీవుడు అన్న పేరు ఉండదు. ఇంక మిగిలేది ఆత్మే, దేవుడే. తత్వమసి అన్న వేదాంత మహావాక్య తాత్ప ర్యం ఇదే. కర్మఫల సంసర్గం తొలగనంత వరకు జీవు డు జీవుడే, దేవుడు దేవుడే, ఇరువురూ వేరు వేరే కదా! అన్నది సందేహం. ఈ భేదం వ్యావహారికమే, పారమా ర్థికం కాదు, అన్నది శాస్త్రం.
 
 నేను రాధేయుణ్ణి అన్న భ్రాంతిలో ఉన్నప్పుడు కూడా, కర్ణుడు కౌంతేయుడే కదా! రాధేయుడన్నది భ్రాంతే. అలాగే జీవుడు ఎల్లప్పుడూ బ్రహ్మ స్వరూపుడే. జ్ఞానం కలిగినప్పుడు జీవుడు నేను బ్రహ్మను అని తెలుసుకొంటాడు. ఇదే పారమార్థిక సత్యం.
 
 భ్రాంతికే అజ్ఞానం, అవిద్య, మాయ అని పేర్లు. మాయకు ఆవరణం, విక్షేపం అనే రెండు శక్తులు ఉన్నాయి. ఆవరణం, ఉన్న వస్తువును ఆవరించి కనపడకుండా చేస్తుంది. విక్షేపం, లేని వస్తువును ఉన్నట్లు భ్రమింపజేస్తుంది. ఆవరణం ఉన్న ముత్తెపు చిప్పను కనుపింపనివ్వదు. విక్షేపం లేని వెండిని ఉన్న ట్లు భ్రమింపచేస్తుంది. ఇదే అన్యధా గ్రహణం.
 
 మాయ తొలగి, ఆత్మసాక్షాత్కారం పొందటం అంటే ఎక్కడో ఉన్న ఆత్మను కొత్తగా సాధించటం కా దు. తన స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే. ముక్తి అన్న ది సిద్ధవస్తువే. తెలుసుకొనవలసిందే. పొందవలసింది కాదు. స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి చేసేదే ఆధ్యా త్మిక సాధన. ఆధ్యాత్మిక సాధనతో అభివృద్ధి సాధి స్తున్న కొద్దీ, శరీరేంద్రియాలపైనా, ప్రపంచం మీదా దృష్టితగ్గి, ఆత్మ మీదే దృష్టి నిలవటం జరుగుతుంది. ఈ విధమైన భావనా పరిణామమే మనోబుద్ధులను శాంతపరచే మహౌషధం.
 
 ఆత్మ విషయమైన ఆలోచన ఏకాగ్రంగా తగినం త కాలం మనసులో ఉంటే, ఇది ఇతర ఆలోచనల్ని నశింపచేయటమే కాక, చివరకు తానూ అదృశ్యమై, ఆత్మానుభవాన్ని కలిగిస్తుంది. కేవలం ఒక సిద్ధాంతా న్ని నిలబెట్టే మాటలు కావివి. గుడ్డి నమ్మకం అంత కంటే కాదు. సత్యాన్ని అన్వేషించే, ఏ సునిశిత బుద్ధి చేతన అయినా, ఆమోదించే సాధనాక్రమమే ఇది. ఆ సాధన ఫలిస్తే జీవుడే దేవుడు. అదే అద్వైతం.
 
 పరమాత్ముని
 

మరిన్ని వార్తలు