ఖర్చు చేసిందెంత.. చేయాల్సిందెంత?: లక్ష్మణ్‌  

14 Aug, 2019 01:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, వాటి అంచనా వ్యయం ఎంత, ఇప్పటివరకు ఖర్చు చేసింది ఎంత, ఇంకా ఖర్చు చేయాల్సింది ఎంతో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దేవుడి దయతో వర్షాలు పడి ప్రాజెక్టులు నిండితే అది కేసీఆర్‌ గొప్పతనం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

కృష్ణా నదిపై ప్రాజె క్టులు పూర్తయి ఉంటే దక్షిణ తెలంగాణలో కరువు వుండేదే కాదని, కేసీఆర్‌ నిర్వాకం వల్ల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో కృష్ణా నీళ్లు వృథా అయి దక్షిణ తెలంగాణ కరువుతో కొట్టుమిట్టాడుతోంది’ అని పేర్కొన్నారు. రాజకీయ అవసరాలకనుగుణంగా సెంటిమెంటును వాడుకో వడం ఒక్క కేసీఆర్‌కే చెల్లుతుందని, అయితే అన్నివేళలా అది పనిచేస్తుందనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా తెలంగాణకు నీళ్లివ్వని కేసీఆర్‌ రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు కృషి చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు