కొత్తగా ఎంపికైన ఎంపీలకు అభినందనలు

28 Mar, 2018 12:06 IST|Sakshi
రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ (పాత చిత్రం)

ఢిల్లీ: కొత్తగా రాజ్యసభకు ఎంపికైన ఎంపీలకు రాజ్యసభ చైర్మన్‌  వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. రాజ్యసభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..పదవీ కాలం ముగిసిన సభ్యుల్లో కొందరు మళ్లీ ఎంపికయ్యారని అన్నారు. రాజ్యసభలో ఉన్న సభ్యులు దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. సభలో పలు రంగాల్లో అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని వ్యాఖ్యానించారు. సభను హుందాగా నిర్వహించేందుకు సభ్యులు సహకరించాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..విశ్రాం జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ ఛైర్మన్‌గా కురియన్‌ సేవలు మరువలేనివన్నారు. ఉత్తమ సేవలు అందించిన సభ్యులకు మరోసారి అభినందనలు చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు