భ్రమల నాయకుడు మరోసారి బయటకు...

4 Jul, 2020 20:17 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబు హయాంలో వెనుకబడ్డ ప్రాంతాలు మరింత నిరాదరణకు గురయ్యాయి. ఆయన చెప్తున్న అమరావతి పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు లాంటి నగరాల్లోను, మచిలీపట్నం, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి లాంటి పట్టణాల్లోనూ కనీస సదుపాయాల్లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. (బాబు.. రాయలసీమకు ఏం చేశారు?)

పాఠశాలల్లో సదుపాయాల్లేక,ఆస్పత్రుల్లో వసతుల్లేక  ప్రజలు కష్టాలు పడ్డారు. ఇలాంటి కనీస అవసరాల మీద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రాంతాలమధ్య  సమతుల్యతను పాటించడానికి వికేంద్రీకరణ మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలో అందరూ బాగుండాలనే నాయకుడు మనకు ఉన్నారు.  కోవిడ్‌ లాంటి ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైన ఈ సమయంలో నాకు ఆ గ్రాఫిక్స్‌ రాజధానే కావాలంటున్న చంద్రబాబుగారిలోని భ్రమల నాయకుడు మరోసారి బయటకు వచ్చారు’ అని ఆయన ట్వీట్‌ చేశారు. (చంద్రబాబు మద్దతు తెలపడం హాస్యాస్పదం)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా