సంచలన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సాక్షి మాలిక్ !

7 Oct, 2016 16:41 IST|Sakshi
సంచలన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సాక్షి మాలిక్ !

ఆటగాళ్లకు ఏ దేశంలోనైనా ఆడే హక్కు ఉంది
రియో ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత, భారత రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన తీవ్ర పరిణామాల దృష్ట్యా.. పాక్ ఆటగాళ్లపై భారత్ లో నిషేధం విధించాలా అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎక్కడైనా, ఏ దేశంలోనైనా పోటీలో పాల్గొనే హక్కు అథ్లెట్లు, ఆటగాళ్లకు ఉంటుందని సాక్షి అభిప్రాయపడింది. దీంతో భారత్ లో పాక్ ఆటగాళ్లను ఆడనివ్వాలని అర్థం వచ్చేలా కామెంట్ చేసిందని ఆమెపై భిన్న కథనాలు వచ్చాయి. అయితే తాను పాక్ ఆటగాళ్లను అన్ని ఈవెంట్లలోనూ భారత్ లో ఆడనివ్వాలని వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన కథనాలను ఆమె తోసిపుచ్చింది.  

తాను ప్రస్తావించిన అంశాలను మీడియాకు మహిళా రెజ్లర్ వెల్లడించింది. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ తో పాటు ఇతర దేశాల్లో నిర్వహించే అన్ని ఈవెంట్లలో ఆటగాళ్లు పాల్గొంటారు. అంతేకానీ, పాక్ ప్లేయర్స్ ను భారత్ లో నిషేధించవద్దని తాను ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఇతర ప్లేయర్స్ లా తాను వ్యవరించనని స్పష్టంచేసింది. పతకాలు సాధించడం కంటే దేశం కోసం ఇంకా ఏదైనా మంచిపని చేస్తే ఎక్కువగా సంతోషపడతానని సాక్షి చెప్పింది. ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తర్వాత దేశంలో చాలా మంది తనను గుర్తిస్తున్నారని, దాంతో తన బాధ్యత మరింత పెరిగిందని వివరించింది. 

మరిన్ని వార్తలు