వదిలినా దొరికారు

12 Dec, 2016 15:18 IST|Sakshi
వదిలినా దొరికారు

ఇంగ్లండ్  268/8 బెయిర్ స్టో అర్ధసెంచరీ
సమష్టిగా రాణించిన భారత బౌలర్లు
నాలుగు క్యాచ్‌లు వదిలేసిన ఫీల్డర్లు 

ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేశారు. పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లేదు... ఇలాంటి స్థితిలో ఏ ప్రత్యర్థరుునా దొరికిన అవకాశాలను వినియోగించుకుని చెలరేగుతుంది. కానీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మాత్రం నిర్లక్ష్యపు షాట్లతో... ఏ మాత్రం బాధ్యత లేని ఆటతీరుతో తొలిరోజే భారత్‌కు దొరికారు. ఫీల్డర్ల నుంచి సహకారం లేకపోరుునా... బౌలర్లు మాత్రం క్రమశిక్షణతో రాణించి మూడో టెస్టులో భారత్‌కు మంచి ఆరంభాన్నిచ్చారు.

మొహాలీ: ఆరంభంలో బౌన్‌‌స... పాత బంతితో పేసర్ల రివర్స్ స్వింగ్... స్పిన్‌కు అనుకూలిస్తుందని భావించిన పిచ్ నుంచి సహకారం లేకపోరుునా బంతుల్లో వైవిధ్యంతో స్పిన్నర్లు... వెరసి బౌలర్ల సమష్టి కృషితో మూడో టెస్టు తొలి రోజును భారత్ సంతృప్తికరంగా ముగించింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో మొదటిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలిఇన్నింగ్‌‌సలో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. బెరుుర్‌స్టో (177 బంతుల్లో 89; 6 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్‌‌సతో అర్ధసెంచరీ చేయగా... బట్లర్ (80 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. స్టోక్స్ (29) పర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సమయానికి రషీద్ (4 బ్యాటింగ్), బ్యాటీ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేశ్, జయంత్, జడేజా తలా రెండు వికెట్లు తీసుకోగా... షమీ, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

సెషన్ 1: ఆరంభంలో వికెట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జాగ్రత్తగా ఇన్నింగ్‌‌సను ప్రారంభించింది. మూడు, పదో ఓవర్లలో షమీ బౌలింగ్‌లో కుక్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను జడేజా, అశ్విన్‌లు వదిలేయడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. మరో ఎండ్‌లో డిఫెన్‌‌సకే ప్రాధాన్యమిచ్చిన హమీద్ (9)... ఉమేశ్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండు బౌండరీలతో ధాటిగా ఇన్నింగ్‌‌సను ప్రారంభించిన రూట్ (15)కూడా ... వికెట్ల ముందు జయంత్‌కు దొరికిపోయాడు. అశ్విన్ తన తొలిబంతికే కుక్ (27)ను పెవిలియన్‌కు పంపించి ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. దీంతో 51 పరుగులకే ఇంగ్లండ్ కీలకమైన మూడు వికెట్లను కోల్పోరుుంది. లంచ్ విరామానికి మరో రెండు ఓవర్లు ఉందనగా అలీ (16) వికెట్‌ను షమీ తీయడంతో సెషన్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఓవర్లు: 29; పరుగులు: 92; వికెట్లు: 4

సెషన్ 2: సూపర్ భాగస్వామ్యం
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్, బెరుుర్‌స్టో చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అద్భుతమైన బంతితో స్టోక్స్ (29)ను అవుట్ చేసి జడేజా ఈ జంటను విడదీశాడు. బట్లర్ అండతో 76 బంతుల్లో బెరుుర్‌స్టో అర్ధసెంచరీ మార్కును చేరుకున్నాడు. తర్వాత మరో వికెట్ పడకుండా ఈ జంట జాగ్రత్త పడింది. ఈ సెషన్‌లో పార్థీవ్ ఒక క్యాచ్ వదిలేశాడు.  ఓవర్లు: 33; పరుగులు: 113; వికెట్లు: 1

సెషన్ 3: బ్యాటింగ్‌లో తడబాటు
టీ విరామానంతరం జడేజా బౌలింగ్‌లో బట్లర్ (43) ఇచ్చిన క్యాచ్‌ను  మిడాఫ్‌లో కోహ్లి ఒడిసిపట్టడంతో ఆరోవికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను పార్థీవ్ వదిలేశాడు. అనంతరం మరో ఆరు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనగా బెరుుర్‌స్టోను... 89వ ఓవర్లో వోక్స్‌ను అవుట్ చేసి భారత బౌలర్లు రోజును ముగించారు.  ఓవర్లు: 28; పరుగులు: 63; వికెట్లు 3

కోహ్లి, స్టోక్స్ వాగ్వాదం
భారత కెప్టెన్ కోహ్లి, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. రెండో సెషన్‌లో నిలకడగా ఆడుతోన్న స్టోక్స్‌ను రవీంద్ర జడేజా అవుట్ చేయడంతో కోహ్లిసేన సంబరాల్లో మునిగింది. వికెట్ కోల్పోరుున ఉక్రోశంలో ఉన్న స్టోక్స్...  పెవిలియన్‌కు వెళ్తూ వెళ్తూ కోహ్లిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోహ్లి కూడా స్టోక్స్‌ను ఉద్దేశించి జవాబు ఇచ్చాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. చివరికి కోహ్లి ఈ విషయంపై అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఈ ఉదంతంలో స్టోక్స్‌ను ఐసీసీ మందలించింది. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పారుుంట్‌ను చేర్చింది. 

రాహుల్‌కు మళ్లీ గాయం
భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మళ్లీ గాయపడ్డాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా తన ముంజేతికి గాయమైంది. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తను ఇబ్బందిపడ్డాడు. దీంతో రాహుల్ స్థానంలో కరుణ్ నాయర్ జట్టులోకి వచ్చాడు. గావస్కర్ చేతుల మీదుగా కరుణ్ టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు.

‘క్రికెట్‌లో ఫీల్డర్ల నుంచి క్యాచ్‌లు చేజారిపోవడం సాధారణమే. ఒక్కోసారి వారే అద్భుతమైన క్యాచ్‌లతో బౌలర్‌కి న్యాయం చేస్తారు. ఇదంతా ఆటలో భాగంగానే చూడాలి. రోజురోజుకీ నా ఆట పరిణతి చెందుతుంది. కుంబ్లే, సంజయ్ బంగర్ చెప్పిన విధంగా నా బౌలింగ్‌ను మార్చుకున్నాను. ఆఫ్ స్టంప్ ఆవల బంతుల్ని సంధించి మంచి ఫలితాలను సాధిస్తున్నాను.’  - ఉమేశ్ యాదవ్   

>
మరిన్ని వార్తలు