డి కాక్ సెంచరీ

15 Nov, 2016 00:29 IST|Sakshi
డి కాక్ సెంచరీ

దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం

హోబర్ట్:  ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్‌‌సలో 326 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డి కాక్ (143 బంతుల్లో 104; 17 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా, బవుమా (74) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 144 పరుగులు జోడించారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్‌కు 6 వికెట్లు దక్కారుు. దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్‌‌సలో 241 పరుగుల భారీ ఆధిక్యం లభిం చింది.

అనంతరం రెండో ఇన్నింగ్‌‌స ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 121 పరుగులు చేసింది. బర్న్స్(0), వార్నర్ (45) అవుట్ కాగా... ఉస్మాన్ ఖాజా (56), స్మిత్ (18) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ మరో 120 పరుగులు వెనుకబడి ఉంది.

మరిన్ని వార్తలు