రికార్డుల మోత

25 Oct, 2015 18:53 IST|Sakshi
రికార్డుల మోత

ముంబై:దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరిగిన చివరి వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది.  దీంతో టీమిండియాపై అత్యధిక పరుగుల రికార్డును దక్షిణాఫ్రికా నమోదు చేసింది.  దాంతో పాటు టీమిండియా కూడా భారీ పరుగులను సమర్పించుకుని చెత్త రికార్డును మూటగట్టుకుంది.

 

అంతకుముందు టీమిండియాపై శ్రీలంక (411/8) నమోదు చేసిన రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.  ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా ఒక ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు నమోదు చేయడం  రెండోసారి.  ఈ ఏడాది జనవరిలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మూడు సెంచరీలను సాధించింది. ఆ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా రెండు వికెట్ల  నష్టానికి 439 పరుగులు చేసింది. ఇదే వన్డే అత్యుత్తమ స్కోరుల్లో రెండోది.  అత్యధిక వన్డే పరుగుల రికార్డు శ్రీలంక(443/9) పేరిట ఉంది. ఓవరాల్ గా దక్షిణాఫ్రికా నాలుగు వందల పరుగులకు పైగా  స్కోరు సాధించడం ఆరోసారి.

 

కాగా, దక్షిణాఫ్రికా ఓపెనర్ హషిమ్ ఆమ్లా సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో అతడీ ఘనత సాధించాడు. 126 మ్యాచ్ ల్లో 123 ఇన్నింగ్స్ ఆడి ఆరువేల మార్కును చేరుకున్నాడు. ఇందులో 21 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు