ఆ వ్యూహమే ఆసీస్ ను నిలబెట్టింది!

20 Mar, 2015 16:33 IST|Sakshi
ఆ వ్యూహమే ఆసీస్ ను నిలబెట్టింది!

అడిలైడ్:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు ముందు జట్టు ఎంపికపై ఆస్టేలియా తీవ్ర తర్జన భర్జనలు పడింది. ప్రధానంగా హజిల్ వుడ్ ను తీసుకోవాలా?కమ్మిన్స్ తీసుకోవాలా?అనే అంశంపై ఆసీస్ సెలెక్టర్లు సుదీర్ఘమైన కసరత్తు చేశారు. ఈ మ్యాచ్ కు ముందు ఆ ఇద్దరు  చెరో రెండు మ్యాచ్ ల్లో ఆడి ఆకట్టుకున్నారు. కమ్మిన్స్ ఐదు వికెట్ల తీయగా, హజిల్ వుడ్ మూడు వికెట్లు తీశాడు. ఈ ఇద్దరు క్వార్టర్స్ కు ముందు నిర్వహించే ఫిట్ నెస్ పరీక్షలో కూడా పాసయ్యారు. వికెట్ల పరంగా చూస్తే కమ్మిన్న్ తీసుకోవాలి.

 

అయితే అందుకు భిన్నంగా ఆసీస్ సెలెక్టర్లు స్పందించారు. కమ్మిన్స్ న పక్కకు పెట్టి హజిల్ వుడ్ కు అవకాశం ఇచ్చారు.  హజిల్ లైన్ అండ్ లెంగ్త్ తో పాటు బాల్ ను బాగా స్వింగ్ చేయగలడు. దీంతో హజిల్ నే కీలక మ్యాచ్ కు ఎంపిక చేశారు. ఆ వ్యూహం ఆసీస్ కు పూర్తిగా లాభించింది. 10 ఓవర్లలో 35 పరుగులిచ్చిన హజిల్ వుడ్ నాలుగు ప్రధాన వికెట్లు తీసి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. కీలకపోరులో పాకిస్థాన్ కు హజిల్ వుడ్ బౌలింగ్ శాపంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అద్భుతమైన స్వింగ్ అండ్ సీమ్ తో ఆకట్టుకున్న హజిల్ వుడ్ ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఏడు వికెట్లు తీశాడు.
 

మరిన్ని వార్తలు