నాకు పోటీ ఎవరూ లేరు: యూసఫ్ పఠాన్

20 Apr, 2017 16:59 IST|Sakshi
నాకు పోటీ ఎవరూ లేరు: యూసఫ్ పఠాన్
కోల్కతా: "నేను ప్రత్యేకం నాకు ఎవరూ పోటీ లేరని' కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు యూసఫ్ పఠాన్ అభిప్రాయ పడ్డాడు. ఎప్పుడూ భయపడనని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహాజ సిద్దమైన ఆటనే ఆడటానికే ఇష్ట పడుతానని వ్యాఖ్యానించాడు. బుధవారం భారత జట్టుకు ఎంపికవుతారనే ఆశ ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించాడు.
 
"ఇది పెద్ద విషయం కాదు, నాకు ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఎవరికి నేను పోటి కాదు, నాకెవరు పోటీ లేరని యూసఫ్ తెలిపాడు. నేను ఫాంలోకి వచ్చాను, ఇలానే నా ఆటను కొనసాగిస్తే అవకాశం రావొచ్చు. ఇప్పుడు భారత జట్టులో లేక పోయిన రేపటి రోజయిన అవకాశం రాకుండా ఉండదని పేర్కొన్నాడు. నేను ఇతరులను పట్టించుకోనని, మంచి క్రికెట్ ఆడటమే నా కర్తవ్యమన్నాడు'. తనకు మంచి రోజులు మొదలయ్యాయని త్వరలోనే భారత జట్టుకు  ఎంపికైతనని యూసఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహజ సిద్దమైన ఆటనే ప్రదర్శిస్తానని, ఢిల్లీ మ్యాచ్ లో అలానే ఆడానని యూసఫ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యచ్ లో చాలా ఒత్తిడి సమయంలో బ్యాటింగ్ కు వెళ్లానన్నాడు. తొలి బంతి అయినా, 40 వ బంతైనా నా షాట్ లో మార్పు ఉండదని యూసఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో యూసఫ్ 39 బంతుల్లో 59 పరుగులు చేసి కోల్కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మరిన్ని వార్తలు