'అతనే పాక్‌ క్రికెట్‌ స్వరూపాన్ని మార్చింది'

2 Mar, 2018 12:02 IST|Sakshi

ఆంటిగ్వా: ప్రపంచ క్రికెట్‌లో పాకిస్తాన్‌ను సముచిత స్థానంలో నిలబెట్టింది ఎవరైనా ఉన్నారంటే అది ఆ జట్టు మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ అని వెస్టిండీస్‌ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ కర్ట్నీ వాల్ష్‌ కొనియాడాడు. 1992లో ఇమ్రాన్‌ నేతృత్వంలో పాకిస్తాన్‌ వరల్డ్‌ కప్‌ గెలవగానే ఆ జట్టు స్వరూపం మొత్తం మారిపోయిందన్నాడు. ఒక జట్టును చరిత్రలో నిలిచిపోయేలా చేసే ఘనత మంచి కెప్టెన్‌కే సాధ్యమవుతుందన్నాడు.

ఈ తరహాలో పాక్‌ జట్టును సానుకూల ధృక్పథంతో ముందుకు నడిపించిన సారథి ఇమ్రాన్‌ ఖాన్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. తాను ఇమ్రాన్‌కు ఒక వీరాభిమానిని అని వాల్ష్‌ తెలిపాడు. ఇమ్రాన్‌ హయాంలో వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ల వంటి యువ క్రికెటర్లను ప్రోత్సహించింది ఇమ్రానేనని వాల్ష్‌ గుర్తు చేసుకున్నాడు. అలా పాక్‌ జట్టును ఒక చాంపియన్‌ టీమ్‌లా నిలబెట్టిన ఘనత ఇమ్రాన్‌దేనని వాల్ష్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు