బంతిని పుల్‌ చేయబోయి..

15 Dec, 2019 15:15 IST|Sakshi

చెన్నై: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. భారత క్రికెట్‌ జట్టు ఆదిలోనే కేఎల్‌ రాహుల్‌(​6), విరాట్‌ కోహ్లి(4) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడగా, రోహిత్‌ శర్మ-శ్రేయస్‌ అయ్యర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను పునః నిర్మించింది. వీరిద్దరూ కలిసి 55 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. రోహిత్‌ శర్మ 56 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. అల్జారీ జోసెష్‌ వేసిన 19 ఓవర్‌ తొలి బంతిని మిడ్‌ వికెట్‌ మీదుగా రోహిత్‌ పుల్‌ చేయబోయాడు. అయితే అది పూర్తిగా మిడిల్‌ కాకపోవడంతో క్యాచ్‌గా పైకి లేచింది. దాన్ని పొలార్డ్‌ అందుకోవడంతో రోహిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. మంచి టచ్‌లో ఉన్న సమయంలో రోహిత్‌ తన వికెట్‌ను చేజార్చుకోవడంతో భారంగా పెవిలియన్‌ వీడాడు. 25 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయిన భారత్‌.. 80 పరుగులు వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది.(ఇక్కడ చదవండి: టీమిండియాకు షాకిచ్చిన కాట్రెల్‌)

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ ముందుగా ఫీల్డింగ్‌  ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్‌కు  దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. తొలి వికెట్‌గా కేఎల్‌ రాహుల్‌(6) ఔట్‌ కాగా, రెండో వికెట్‌గా విరాట్‌ కోహ్లి(4) పెవిలియన్‌ చేరాడు. ఈ రెండు వికెట్లను విండీస్‌ పేసర్‌ కాట్రెల్‌ సాధించి టీమిండియాకు షాకిచ్చాడు.  ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ రెండో బంతికి రాహుల్‌ను ఔట్‌ చేసిన కాట్రెల్‌.. ఆ ఓవర్‌ చివరి బంతికి కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. హెట్‌మెయిర్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌ ఔట్‌ కాగా, కోహ్లి వికెట్ల మీదుగా బంతిని ఆడి బౌల్డ్‌ అయ్యాడు.

మరిన్ని వార్తలు