'టీమిండియానే ఫేవరెట్'

14 Oct, 2015 18:49 IST|Sakshi
'టీమిండియానే ఫేవరెట్'

ట్రినిడాడ్: వచ్చే సంవత్సరం జరుగనున్న ట్వంటీ 20 వరల్డ్ కప్ లో టీమిండియానే ఫేవరెట్ అని వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. ట్వంటీ 20ల్లో టీమిండియా చాలా ప్రమాదకరమైన జట్టని లారా తెలిపాడు. అందులోనూ స్వదేశంలో టీమిండియాకు మెరుగైన రికార్డు ఉందన్న సంగతిని గుర్తు చేశాడు. ట్వంటీ 20 వరల్డ్ కప్ కూడా భారత్ లోనే జరుగుతున్నందున టీమిండియాను ఫేవరెట్ గా పరిగణించవచ్చన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను టీమిండియా కోల్పోయినా.. ఆ జట్టు ఎప్పటికీ ప్రమాదకరమేనని లారా తెలిపాడు.

 

ఈ సందర్భంగా 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను గుర్తు  చేశాడు. అప్పుడు టీమిండియా అమోఘంగా రాణించి కప్ ను చేజిక్కించుకుందన్నాడు. 'టీమిండియా ప్రమాదకరమైన జట్లలోఒకటి. ఆ జట్టును ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు. స్వదేశంలో మరీ ప్రమాదకరం. ఆ జట్టులో నైపుణ్యం గల ఆటగాళ్లకు కొదవలేదు.  ట్వంటీ 20 వరల్డ్ కప్ లో టీమిండియానే ఫేవరెట్'అని లారా తెలిపాడు.

>
మరిన్ని వార్తలు