న్యూజిలాండ్‌ చిత్తు.. సెమీస్‌కు మిథాలీ సేన

16 Jul, 2017 08:13 IST|Sakshi
న్యూజిలాండ్‌ చిత్తు.. సెమీస్‌కు మిథాలీ సేన
డెర్బీ: ఐసీసీ మహిళల వరల్డ్‌ కప్‌ డూ ఆర్‌ డై మ్యాచ్‌లో భారత్‌ మహిళ జట్టు భళా అనిపించింది. కనీవినీ ఎరుగని రీతిలో భారీ పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. 186 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నమిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 265 పరుగులు చేసి న్యూజిలాండ్‌కు 266 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, హర్మన్‌ ప్రీత్‌ నెమ్మదిగా పరుగులు రాబట్టారు. ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో మిథాలీ సెంచరీ (109) చేసింది.

దీంతో వన్డే మ్యాచ్‌లల్లో మిథాలీ 49 అర్థ సెంచరీలు, ఆరు సెంచరీలు పూర్తి చేశారు. ఇటీవలే మిథాలీ మహిళల వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సాధించిన విషయం తెలిసిందే. భారత జట్టులో హర్మన్‌ ప్రీత్‌ (60), వేద కిృష్ణమూర్తి (70) పరుగులతో రాణించారు. ఇక 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ ముందునుంచే తడబడుతూ వికెట్లను కోల్పోయింది. 25.3 ఓవర్లలో 79 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారత్‌ బౌలర్ల లోగైక్వాడ్‌ 5/15) దీప్తి(2/26) న్యూజిలాండ్‌ బ్యాట్స్‌వుమెన్స్ నడ్డి విరిచారు. జులన్‌,శిఖ, పూనమ్‌ తలో వికెట్‌ తీశారు.