సీతమ్మను బంధించిన చోటుకెళ్లిన టీమిండియా

11 Aug, 2017 15:29 IST|Sakshi



భూటాన్‌: శ్రీలంకతో ఆఖరి టెస్టు నేపథ్యంలో ప్రస్తుతం విరామంలో ఉన్న భారత క్రికెట్‌ టీం శ్రీలంకలో భారత్‌కు ముఖ్యమైన ప్రాంతాన్ని సందర్శించింది. సీతమ్మను రావణాసూరుడు అపహరించుకుపోయి దాచిన అశోక వనవాసం (అశోక వాటిక) చూసేందుకు వెళ్లారు. రామాయణం, విష్ణుపురాణం పేర్కొన్న ప్రకారం సిలోన్‌ సామ్రజ్యాన్ని (శ్రీలంక) రావణాసూరుడు పరిపాలించాడు. ఆ సమయంలో శ్రీరాముడి అర్థాంగి అయిన సీతమ్మవారిని రావణుడు దొంగచాటుగా అపహరించుకుపోయి అతడి సామ్రజ్యంలోని అశోక వనవాసంలో ఉంచినట్లు పురాణాలు చెబుతాయి.

ఆ ఆనవాళ్లు ప్రస్తుతం సీతా ఎలియా అనే ప్రాంతంగా పిలవబడుతున్న ప్రాంతంలోని అశోక వాటికలో ఉన్నాయి. భారత్‌ నుంచి ఎంతో మంది హిందువులు శ్రీలంకకు వెళ్లి ఆ ప్రాంతాన్ని చూసి తరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీలంకతో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న టీం ఇండియా ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో విజయాన్ని సాధించి శనివారం ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వారికి దొరికి విరామ సమయాన్ని ఇలా సీతమ్మను బందించిన చోటు చూసేందుకు వెళ్లారు. అక్కడి వెళ్లిన వారిలో మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, వృద్ధిమాన్‌ సహా వాటి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.





మరిన్ని వార్తలు