భారత్ పోరాటం ముగిసింది

13 Jun, 2014 01:16 IST|Sakshi
భారత్ పోరాటం ముగిసింది

జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్
 టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ల పోరు రెండో రౌండ్‌లోనే ముగిసింది. సింగిల్స్‌లో తాన్వి లాడ్, సౌరభ్‌వర్మ వెనుదిరగ్గా...డబుల్స్ జోడీలు ప్రభావం చూపలేకపోయాయి. తొలి రౌండ్‌లో సంచలనం సృష్టించిన తాన్వి తర్వాతి మ్యాచ్‌లో అదే ఆటతీరును పునరావృతం చేయలేకపోయింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి జిన్ ల్యూ 21-18, 21-12 తేడాతో తాన్విని సునాయాసంగా ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 9-21, 6-21 స్కోరుతో నాలుగో సీడ్ కెనిచి టగో (జపాన్) చేతిలో చిత్తుగా ఓడాడు.
 
 మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడి పరాజయం పాలైంది. యున్ జంగ్-న కిమ్ (కొరియా) జంట 21-12, 21-23, 21-12తో భారత ద్వయంపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా ఇండియాకు కలిసి రాలేదు. అశ్విని-తరుణ్ కోన 17-21, 11-21 తేడాతో మిసాకి మట్సుటొమొ-కెనిచి హయకవ (జపాన్) జంట చేతిలో ఓడిపోయారు.
 

>
మరిన్ని వార్తలు