ఎడ్వార్డ్స్, బ్రేవో బాదారు.. కివీస్ బేజారు

8 Jan, 2014 16:18 IST|Sakshi
ఎడ్వార్డ్స్, బ్రేవో బాదారు.. కివీస్ బేజారు

హామిల్టన్: న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. చివరి వన్డేలో కివీస్ను విండీస్ 203 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. కిర్క్ ఎడ్వార్డ్స్(123), డ్వేన్ బ్రేవో(106) సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్ పావెల్(73) అర్థ సెంచరీతో రాణించాడు. చార్లెస్ 31 పరుగులు చేశాడు. కివీస్ మెక్ కల్లమ్, ఆండర్సన్, విలియమ్సన్ ఒక్కో వికెట్ తీశారు.

364 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 160 పరుగులకే కుప్పకూలింది. ఆండర్సర్(29) టాప్ స్కోరర్గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో మిల్లర్ 4 వికెట్లు పడగొట్టాడు. హోల్డర్, రసెల్ రెండేసి వికెట్లు తీశారు. బ్రేవో ఒక వికెట్ దక్కించుకున్నాడు. డ్వేన్ బ్రేవోకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. మొదటి వన్డేలో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో నెగ్గగా, రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. మూడు, నాలుగు వన్డేల్లో న్యూజిలాండ్ విజయంగా సాధించింది.

>
మరిన్ని వార్తలు