వచ్చే ఏడాది భారత్-పాక్ సిరీస్!

13 Apr, 2014 00:17 IST|Sakshi
వచ్చే ఏడాది భారత్-పాక్ సిరీస్!

బీసీసీఐ నిర్ణయం కోసం పీసీబీ నిరీక్షణ
 
 కరాచీ: చిరకాల ప్రత్యర్థి భారత్‌తో మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలన్న పాకిస్థాన్ కోరిక నెరవేరనుందా! అవుననే అంటున్నాయి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వర్గాలు. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఈ మేరకు ఇరు దేశాల బోర్డులు అంగీకారానికి వచ్చినట్లు చెబుతున్నాయి. పాక్ బోర్డు చైర్మన్ నజామ్ సేథి బీసీసీఐ అధికారులతో చర్చించారని, వచ్చే ఎనిమిదేళ్లలో పాక్‌తో కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు బీసీసీఐ అంగీకరించిందని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు.

 

 అయితే ఇందుకు బోర్డులోని ఇతర సభ్యులు, భారత ప్రభుత్వం నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుందని, వారం రోజుల్లో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని బీసీసీఐ ప్రతినిధి చెప్పినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. బీసీసీఐ నుంచి ఆమోదం లభిస్తే 2015లో సిరీస్ జరిగే అవకాశం ఉందని పీసీబీ చెబుతోంది.

మరిన్ని వార్తలు