జపాన్ ప్లేయర్ ఒకుహారకు కాంస్యం

19 Aug, 2016 17:43 IST|Sakshi
జపాన్ ప్లేయర్ ఒకుహారకు కాంస్యం

జపాన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఒకుహార చాలా అదృష్టవంతురాలు. మ్యాచ్ ఆడకుండానే కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం.. రియో ఒలింపిక్స్ లో భాగంగా కాంస్యం కోసం నేటి సాయంత్రం చైనా స్టార్ షట్లర్ లీ ఝురయ్తో మ్యాచ్లో ఒకహార తలపడాల్సి ఉంది. అయితే గురువారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ తో ఆడుతున్న సందర్భంగా లీ ఝురయ్ స్వల్పంగా గాయపడింది. మ్యాచ్ నుంచి వైదొలగకుండా ఝురయ్ అలాగే పోరాడి 21-14, 21-16 తేడాతో మారిన్ చేతితో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలని ఝురయ్ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఎలాంటి పోరు లేకుండానే ఒకుహార కాంస్య పతకాన్ని దక్కించుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చేతిలో 21-19, 21-10తో ఓటమిపాలైన ఒకుహారకు కాంస్యం దక్కడం ఊరటనిచ్చే అంశమే. ఒకవేళ చైనా స్టార్ ఝరయ్ ఫిట్ గా ఉన్నట్లయితే ఒకుహార కాంస్యం నెగ్గడం అంత తేలిక కాదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు