హరికృష్ణకు ఏడో స్థానం

27 Jan, 2014 01:56 IST|Sakshi

విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
 
 ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చివరిదైన 11వ రౌండ్‌లో హరికృష్ణ 37 ఎత్తుల్లో బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడిపోయాడు. మొత్తం 12 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ రౌండ్ రాబిన్ లీగ్ టోర్నమెంట్‌లో హరికృష్ణ మూడు విజయాలు, మూడు పరాజయాలు, ఐదు ‘డ్రా’లతో ఐదున్నర పాయింట్లు సంపాదించాడు. ఎనిమిది పాయింట్లతో లెవాన్ అరోనియన్ (అర్మేనియా) విజేతగా నిలిచాడు.
 

మరిన్ని వార్తలు