సీఎం.. గోబ్యాక్ | Sakshi
Sakshi News home page

సీఎం.. గోబ్యాక్

Published Mon, Jan 27 2014 1:52 AM

cm goback ..cm goback slogans at gandhi bhavan

 గాంధీభవన్‌లో కిరణ్‌కు తెలంగాణ సెగ
 సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ వాదుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ కార్యక్రమానికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాగానే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో 10 నిమిషాల్లోనే వేడుకలను ముగించాల్సి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జి.ప్రసాద్‌కుమార్, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ తదితరులు ఉదయం 8 గంటలకు జెండా వందనానికి విచ్చేశారు.
 
  ఐదు నిమిషాల అనంతరం సీఎం రాగానే, శాప్ మాజీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, పీసీసీ డాక్టర్ సెల్ చైర్మన్ ఆనంద్ ఆధ్వర్యంలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ‘సీఎం... గో బ్యాక్,  కిరణ్‌కు సీఎంగా ఉండే అర్హత లేదు’ అంటూ నినాదాలు చేశారు. సీఎం వేదిక పైకి రాగానే బొత్స జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించారు. సరిగ్గా 10 నిమిషాల్లో కార్యక్రమం ముగించగా ముఖ్యమంత్రి గాంధీభవన్‌లోకి రాకుండా పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లాలంటూ అక్కడ నుంచి నిష్ర్కమించారు.

Advertisement
Advertisement