ఫీల్డ్ లో ఇద్దరు ఆమ్లాలు!

27 Oct, 2017 16:01 IST|Sakshi

బ్లోమ్ ఫోంటీన్:దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ ల జట్ల మధ్య జరిగిన ఇక్కడ గురువారం జరిగిన తొలి టీ 20లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను ఓపెనర్లు హషీమ్ ఆమ్లా-డీకాక్ లు ఆరంభించిందుకు అడుగుపెట్టారు. అయితే ఆ సమయంలో ఇద్దరు ఆమ్లాలు ఒకేసారి కనిపించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన చర్చమొదలైంది. వారిద్దరూ ధరించిన జెర్సీలపై ఆమ్లా అని పేరు ఉండటంతో దీన్ని చూసిన ప్రేక్షకులు కొద్దిపాటిఇబ్బందికి గురయ్యారు. అయితే కాసేపటికి జరిగిన విషయాన్ని తెలుసుకుని నవ్వుకోవడం వారి వంతైంది.

అసలేం జరిగిందంటే.. మ్యాచ్ ఆరంభానికి ముందు డీకాక్ జెర్సీ కనిపించలేదు. ఎంత వెదికినా తన జెర్సీ దొరక్కపోవడంతో ఆమ్లా తన జెర్సీని అందించాడు. ఆ క్రమంలోనే ఆమ్లా జెర్సీ వేసుకుని డీకాక్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు. అయితే మ్యాచ్ కాసేపు జరిగే వరకూ ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద ఆమ్లా(3)అవుటైన తరువాత డివిలియర్స్ తో కలిసి డీకాక్ ఆడుతున్న సమయంలో ప్రేక్షకుల్లో గందరగోళం మొదలైంది. ఆమ్లా అవుటై పెవిలియన్ కు చేరితే మళ్లీ ఎలా వచ్చాడనే సందిగ్థత ఏర్పడింది. కాకపోతే చివరకు అసలు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.మొదటి టీ 20లో సఫారీలు 20 పరుగుల తేడాతో విజయం సాధించారు.
 

మరిన్ని వార్తలు