రన్నరప్ అమీ కమాని

12 Dec, 2016 15:19 IST|Sakshi
రన్నరప్ అమీ కమాని

ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ 
మాస్టర్స్ విభాగంలో విజేత ధర్మేందర్

దోహా: ఫైనల్‌కు చేరిన తొలిసారే ప్రపంచ స్నూకర్ చాంపియన్‌గా అవతరించాలని ఆశించిన భారత క్రీడాకారిణి అమీ కమానికి నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో 24 ఏళ్ల అమీ కమాని రన్నరప్‌గా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ వెండీ జాన్‌‌స (బెల్జియం) 5-0తో ఫ్రేమ్‌ల తేడాతో అమీ కమానిపై గెలిచి వరుసగా ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన అమీ కమాని ఫైనల్లో నిలకడగా పారుుంట్లు సాధించినా... తుదకు అనుభవజ్ఞురాలైన వెండీ జాన్‌‌సదే పైచేరుుగా నిలిచింది. మరోవైపు మాస్టర్స్ విభాగంలో భారత్‌కు చెందిన ధర్మేందర్ లిల్లీ 6-2 ఫ్రేమ్‌ల తేడాతో ఇవాన్‌‌స (వేల్స్)ను ఓడించి విజేతగా నిలిచాడు. పురుషుల విభాగంలో భారత స్టార్ పంకజ్ అద్వానీ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. సెమీఫైనల్లో పంకజ్ అద్వానీ 2-7 ఫ్రేమ్‌ల తేడాతో ఆండ్రూ పాజెట్ (వేల్స్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో సోహైల్ వహీది (ఇరాన్) 8-1తో పాజెట్‌ను ఓడించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 

మరిన్ని వార్తలు