‘సంచలనాలు నమోదు చేసే జట్టది’

27 May, 2019 11:55 IST|Sakshi

ముంబై: ఇంగ్లండ్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో ఆఫ్గానిస్తాన్‌ జట్టు సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉందని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాపడ్డారు. వార్మప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై వచ్చిన ఫలితమే ఇందుకు నిదర్శనమన్నారు. స్పిన్‌ విభాగంలో ఆఫ్గాన్‌ అత్యంత పటిష్టంగా ఉందన్నారు. యువ సంచలన రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌లు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లని అభివర్ణించారు. ఆఫ్గాన్‌ ఎన్ని విజయాలు నమోదు చేస్తుందో చెప్పలేనని.. కానీ సంచల రీతిలో కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకుంటుందన్నారు. పెద్ద జట్లకు షాక్‌ ఇచ్చే సత్తా ఆఫ్గాన్‌ జట్టుకుందన్నారు.
మా జట్టుపై నమ్మకం ఉంది..
ప్రపంచకప్‌లో తమ జట్టు సెమీఫైనల్‌కు చేరుతుందని కచ్చితంగా చెప్పలేనని.. కానీ తమ జట్టుపై నమ్మకం ఉందని ఆఫ్గాన్‌ సారథి గుల్బదిన్‌ నైబ్‌ పేర్కొన్నారు. ప్రతీ మ్యాచ్‌ను ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌గా భావించే ఆడతామని తెలిపాడు. తమ జట్టులోని ప్రతీ ఒక్క ఆటగాడు దేశం గర్వించేలా ఆడాలని కోరుకుంటున్నారని వివరించాడు. వార్మప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై గెలవడంతో తమకు మరింత విశ్వాసం పెరిగిందన్నారు. ఇక మే 30 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ తొలి పోరులో ఇంగ్లండ్‌, దక్షిణాఫికా జట్లు తలపడుతున్నాయి.   

మరిన్ని వార్తలు