జోక్స్ పేల్చిన విధ్వంసక క్రికెటర్

27 Sep, 2017 14:44 IST|Sakshi

ప్రపంచ క్రికెట్‌లో విధ్వంసక ఆటగాళ్లలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఒకరు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏడాది తర్వాత పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఆఫ్రిది టి20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆఫ్రిది తన బ్యాటింగ్‌పై తానే జోకులు పేల్చుతూ అందర్నీ నవ్వించారు. తాను తక్కువ బంతుల్లో ఎక్కువ చేయాలని ప్రయత్నించడానికి కారణం చెప్పేశారు. ప్రేక్షకుల సమయాన్ని వృథా చేయడం ఇష్టంలేకే కొన్ని బంతుల్లోనే పరుగులు రాబట్టాలని యత్నించి కొద్దిసేపటికే పెవిలియన్ బాట పడతానని చెప్పారు. అదే విధంగా నా బ్యాటింగ్ తరహాలోనే కొంత సమయంలో చిన్న ప్రసంగంతో అభిప్రాయం చెబుతా అనడంతో అక్కడ నవ్వులు పూశాయి.

బ్యాట్స్‌మెన్‌గా జట్టులోకి వచ్చిన తాను ఆపై ఆ విభాగంలో తరచూగా విఫలమవుతున్నా.. బౌలింగ్‌తోనే కెరీర్‌ను నెట్టుకొచ్చినట్లు వెల్లడించారు. 398 వన్డేలు ఆడిన ఆఫ్రిది 395 వికెట్లు తీసి వసీం అక్రమ్, వకార్ యూనిస్ తర్వాత మేటి పాక్ బౌలర్‌గానూ పేరుగాంచారు. గత నెలలో జరిగిన నాట్‌వెస్ట్‌ టి20 బ్లాస్ట్‌ టోర్నమెంట్‌లో 43 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగి 101 పరుగులు చేసి.. ట్వంటీ20 కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు ఆఫ్రిది. గతంలో ఆటతో ఇప్పుడు హాస్యంతో ఆఫ్రిది ఆకట్టుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు