పాకిస్తాన్‌దే టి20 సిరీస్‌

4 Apr, 2017 00:29 IST|Sakshi
పాకిస్తాన్‌దే టి20 సిరీస్‌

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను పాకిస్తాన్‌ జట్టు కైవసం చేసుకుంది. చివరిదైన నాలుగో మ్యాచ్‌లో పాక్‌ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 3–1తో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. ఓపెనర్‌ చాడ్విక్‌ వాల్టన్‌ (31 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), బ్రాత్‌వైట్‌ (24 బంతుల్లో 37 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు.

పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం పాక్‌ జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. షెహజాద్‌ (45 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్సర్‌) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. హసన్‌ అలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవా ర్డు దక్కగా... షాదాబ్‌ ‘ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా