బౌలింగ్‌ కోచ్‌ రేసులో సునీల్‌ జోషి

6 Aug, 2019 16:34 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌ పదవికి మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషి దరఖాస్తు చేసుకున్నాడు. దాదాపు రెండున్నరేళ్లు బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌గా పని చేసిన జోషి.. భారత బౌలింగ్‌ కోచ్‌ రేసులోకి వచ్చాడు. భారత బౌలింగ్‌ కోచ్‌ విషయంలో స్పిన్‌ బౌలింగ్‌లో అనుభవమున్న వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నదని బలంగా నమ్ముతున్న సునీల్‌ జోషి అందుకు దరఖాస్తు చేశాడు. ‘ అవును.. నేను టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ కోసం దరఖాస్తు చేశా. నేను ఇప్పటికే బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌గా నా వంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించా. తదుపు చాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నా. భారత్‌కు స్పెషలిస్టు స్పిన్‌ కోచ్‌ అవసరం లేదనే విషయం నాకు తెలుసు. కాకపోతే స్పిన్‌లో అనుభవమున్న నన్ను బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేస్తారని నమ్ముతున్నా’ అని జోషి తెలిపాడు.

‘పలు అంతర్జాతీ క్రికెట్‌ జట్లు స్పెషలిస్టులను ఎంపిక చేసుకుంటూ ఉంటాయి. దాంతోపాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌ కూడా ఉంటారు. అందులో పేస్‌ బౌలింగ్‌ కోచ్‌ కానీ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ కానీ ఉంటారు. భారత్‌ క్రికెట్‌ జట్టు కూడా బౌలింగ్‌ కోచ్‌ అవసరం. అది స్పిన్‌ బౌలర్‌ కానీ, పేస్‌ బౌలర్‌ కానీ కావొచ్చు. అందుకు నేను కూడా బౌలింగ్‌ కోచ్‌ పదవి రేసుకు పోటీ పడటం తప్పులేదు’ అని జోషి పేర్కొన్నాడు. 1996-2001 మధ్య కాలంలో భారత క్రికెట్‌ జట్టు ప్రాతినిథ్యం వహించిన జోషి 15 టెస్టుల్లో 41 వికెట్లు సాధించాడు. ఇక వన్డేల్లో 69 వికెట్లు తీశాడు.  తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 160 గేమ్స్‌ ఆడి 615 వికెట్లు సాధించాడు.

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పుడు కోహ్లి.. ఇప్పుడు స్మిత్‌

అయ్యో ఇంగ్లండ్‌..

నేటి క్రీడా విశేషాలు

వారెవ్వా.. స్టీవ్‌ స్మిత్‌

పొలార్డ్‌కు జరిమానా

నా కెరీర్‌లో అదే చెత్త మ్యాచ్‌: అక్తర్‌

బెల్జియం సైక్లిస్టు మృతి

కోచ్‌ ఎంపికలో థర్డ్‌ అంపైర్‌?

అఫ్రిది వ్యాఖ్యలను తిప్పికొట్టిన గంభీర్‌

క్రికెట్‌లో నువ్వు నిజమైన చాంపియన్‌: కోహ్లి

‘ నా క్రికెట్‌ కెరీర్‌ను సంతృప్తిగా ముగిస్తున్నా’

‘చెత్త’ అంపైరింగ్‌ రికార్డు సమం

జైపూర్‌ జోరుకు బ్రేక్‌

ఓవరాల్‌ చాంప్‌ సిద్ధార్థ డిగ్రీ కాలేజి

స్టెయిన్‌ ‘టెస్టు’ ముగిసింది!

ఆసీస్‌ అద్భుతం

సింధు, సైనాలకు ‘బై’

సాకేత్‌ పునరాగమనం

వెటోరి జెర్సీకి కివీస్‌ గుడ్‌బై

మార్పులు చేర్పులతో...

చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌

యువరాజ్‌ స్టన్నింగ్‌ క్యాచ్ చూశారా?

అరంగేట్రంలోనే డిమెరిట్‌ పాయింట్‌

ఆ జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్‌

మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: అక్తర్‌

స్టీవ్‌ స్మిత్‌ మరో రికార్డు

సర్ఫరాజ్‌ను తీసేయండి.. నన్ను కొనసాగించండి!

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

యువరాజ్‌ రిటైర్డ్‌ హర్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా

న్యూ లుక్‌లో కమల్‌ హాసన్‌

రికార్డ్‌ సృష్టించిన ‘నే జా’

స్టార్ హీరోయిన్‌కి ‘బిగ్‌బాస్‌’ కష్టాలు

‘చేతిలో డబ్బు లేదు...గుండె పగిలేలా ఏడ్చా’

సెన్సార్‌ సమస్యల్లో కాజల్‌ ‘క్వీన్‌’!