తడబడిన సన్ రైజర్స్

17 May, 2017 21:49 IST|Sakshi
తడబడిన సన్ రైజర్స్
► కోల్ కతా లక్ష్యం 128
► మ్యాచ్ కు వర్షం అడ్డంకి
 
బెంగళూరు: కోల్ కతా నైట్ రైడర్స్ తో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడింది. కోల్ కతా బౌలర్ల దాటికి 7 వికెట్లు కోల్పోయి  కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.  తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఆదిలోనే ధావన్(11) వికెట్ కోల్పోయింది. ముందు నుంచి నెమ్మదిగా ఆడిన సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ ఏదశలో బ్యాట్ ఝలిపించలేక పోయారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి సన్ రైజర్స్ వికెట్ కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆతరువాత కొద్ది వేగం పెంచిన వార్నర్-విలియమ్సన్ జోడి ఎక్కువ సేపు కొనసాగించలేకపోయింది.
 
కౌల్టర్-నిల్ బౌలింగ్ లో విలియమ్సన్(24) క్యాచ్ అవుటవ్వగా, వెంటనే వార్నర్(37) పీయుష్ చావ్లా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 50 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్ మన్ నిలదొక్కుకోలేకపోయారు. కీలక మ్యాచ్ లో యువరాజ్ (9) మరోసారి నిరాశ పర్చాడు. విజయ్ శంకర్(22) వేగంగా ఆడే ప్రయత్నంచేసినా కౌల్టర్-నిల్ మరో సారి దెబ్బకొట్టాడు. అదే ఓవర్లో క్రిస్ జోర్డాన్ డక్ అవుటవ్వడంతో జట్టు 119 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నమాన్ ఓజా (16) చివరి బంతికి క్యాచ్ అవుటవ్వడంతో కోల్ కతాకు స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక కోల్ కతా బౌలర్లలో కౌల్టర్ నిల్ 3 వికెట్లు, ఉమేశ్ యాదవ్ కు 2 వికెట్లు తీయగా, బౌల్ట్, పీయుష్ చావ్లాకు తలో వికెట్ దక్కింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం  ప్రారంభమవడంతో గ్రౌండ్ సిబ్బంది కవర్లతో గ్రౌండ్ ని కప్పేశారు.
>
మరిన్ని వార్తలు