ఆ విషయంలో సచిన్‌కన్నా కోహ్లి మిన్న

3 Mar, 2017 00:26 IST|Sakshi
ఆ విషయంలో సచిన్‌కన్నా కోహ్లి మిన్న

మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ  

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 333 పరుగుల తేడాతో దారుణ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ కోహ్లికి మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ బాసటగా నిలిచారు. ఆ టెస్టులో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కోహ్లి 0, 13 పరుగులు చేశాడు. అయితే ఆసీస్‌పై కోహ్లికి బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు మించిన అద్భుత రికార్డు ఉందని గుర్తు చేశారు. ఆసీస్‌ గడ్డపై అతడికి వరుసగా నాలుగు టెస్టు సెంచరీలు చేసిన ఘనత ఉందని అన్నారు.

ఇది సచిన్‌కు కూడా సాధ్యంకాలేదని స్పష్టం చేశారు. ‘కోహ్లి కూడా మానవమాత్రుడే. అతడూ ఓ రోజు విఫలం కావాల్సిందే. పుణే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడు పేలవ షాట్‌ ఆడాడు. అయితే గతంలో ఆసీస్‌ పర్యటనలో తను సాధించిన వరుస నాలుగు సెంచరీలను గమనించండి. సచిన్‌ కూడా అలా చేయడం నేను చూడలేదు’ అని గంగూలీ తేల్చి చెప్పారు.

 

మరిన్ని వార్తలు