భారత్ ‘ఎ’ 304/6

7 Jul, 2014 00:54 IST|Sakshi

ఆస్ట్రేలియా ‘ఎ’తో మ్యాచ్
 బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత ‘ఎ’ జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది. ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో ఆదివారం ప్రారంభమైన తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారి (118 బంతుల్లో 83; 12 ఫోర్లు, 1 సిక్స్), కీపర్ నమన్ ఓజా (115 బంతుల్లో 82 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జీవన్‌జోత్ సింగ్ (56) కూడా అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
 
 ఆసీస్ బౌలర్లలో మిచెల్ మార్ష్, కటింగ్, బోయ్స్ తలా 2 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి  బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ (15) వికెట్ కోల్పోయింది.  ఆ తర్వాత కొద్ది సేపటికే రాబిన్ ఉతప్ప (23)తో పాటు అంబటి రాయుడు (0) కూడా వెనుదిరిగారు. అయితే ఈ దశలో జీవన్‌జోత్, తివారి కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నమన్ ఓజాతో పాటు ధావల్ కులకర్ణి (12) క్రీజ్‌లో ఉన్నాడు.
 

మరిన్ని వార్తలు