డీఆర్ఎస్ కు వెంగసర్కార్ మద్దతు

19 Dec, 2014 20:26 IST|Sakshi
డీఆర్ఎస్ కు వెంగసర్కార్ మద్దతు

ముంబై:నిర్ణయ సమీక్ష పద్దతి(డీఆర్ఎస్)ను బీసీసీఐ వ్యతిరేకించగా.. భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగసర్కార్ మాత్రం ఆ పద్దతిని వెనకేసుకొచ్చాడు. టెస్టుల్లో ఆ విధానాన్ని అవలంభించడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నాడు. డీఆర్ఎస్ విధానం 100 శాతం కరెక్టు అని చెప్పకపోయినా.. ఈ సిరీస్ లో అంపైర్లు తీసుకునే తప్పుడు నిర్ణయాల కంటే ఇదే నయయన్నాడు. దీంతో మనం అంతా డీఆర్ఎస్ ను అంగీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.

 

శుక్రవారం రచయిత మకరంద వాయింగన్ కర్ పుస్తక విడుదల కార్యక్రమానికి హాజరైన వెంగీ.. పై విధంగా స్పందించాడు. తొలి రెండు టెస్టుల్లో భారత ఆటగాళ్లు అజ్యింకా రహానే, చటేశ్వర పూజారాలు అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు అవుట్ కావడంతో డీఆర్ఎస్ విధానాన్ని వెంగీ తాజాగా తెరపైకి తీసుకొచ్చాడు.

మరిన్ని వార్తలు