'ఆసీస్కు భయపడేది లేదు'

2 Apr, 2016 18:19 IST|Sakshi
'ఆసీస్కు భయపడేది లేదు'

కోల్కతా: మహిళల టీ 20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే తుదిపోరులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని వెస్టిండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ స్పష్టం చేసింది. ఇప్పటికే వరుసగా మూడు టైటిల్ గెలిచి, డిఫెండింగ్ చాంపియన్ గా ఉన్న ఆసీస్ జట్టును చూసి తాము భయపడేది లేదని పేర్కొంది.

 

'ఆసీస్కు దీటైన సమాధానిమిస్తాం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ జట్టు బలాన్ని చూసి బెదిరిపోం. మేము కచ్చితంగా తొలి టైటిల్ను సాధించాలనే పట్టుదలగా ఉన్నాం. ఆసీస్ ఎన్ని టైటిల్స్ గెలిచినా  అది మాకు అనవసరం. రేపటి పోరుకు సానుకూలంగా సన్నద్ధమవుతున్నాం. తుది సమరంలో గెలుపు మాదే' అని టేలర్ ధీమా వ్యక్తం చేసింది. తమకు తొలి ఫైనల్ కావడంతో అమీతుమీ మ్యాచ్ కు ఆతృతగా ఎదురుచూస్తున్నామని పేర్కొంది. ఈ క్రమంలో తమపై అధిక ఒత్తిడి పడే అవకాశం ఉన్నందును సాధ్యమైనంతవరకూ దాన్ని అధిగమించేందుకు యత్నిస్తామని  తెలిపింది. పటిష్టమైన ఆసీస్ తో పోరులో తమ సహజ సిద్దమైన ఆటనే ప్రదర్శిస్తామని టేలర్ పేర్కొంది.

మరిన్ని వార్తలు