మళ్లీ కెప్టెన్సీ ఇస్తే..

7 Nov, 2016 15:58 IST|Sakshi
మళ్లీ కెప్టెన్సీ ఇస్తే..

న్యూఢిల్లీ:మరోసారి భారత పురుషుల హాకీ జట్టుకు కెప్టెన్గా నియమిస్తే ఆ పదవిని అత్యంత సంతోషంగా స్వీకరిస్తానని అంటున్నాడు మాజీ సారథి సర్ధార్ సింగ్. రియో ఒలింపిక్స్ ముందు వరకూ దాదాపు నాలుగు సంవత్సరాలు భారత జట్టుకు కెప్టెన్గా ఉండటం తనకు దక్కిన అరుదైన గౌరవమన్నాడు. మరొకసారి టీమిండియా పగ్గాలు అప్పజెప్పితే సంతోషంగా స్వీకరిస్తానని మనసులో మాటను వెల్లడించాడు. జట్టు పగ్గాలను కోల్పోవడం కాస్త నిరాశ కల్గించినా, దేశానికి ఆడటం అంతకన్నాముఖ్యమన్నాడు. ఇటీవల కాలంలో తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలపై సర్దార్ స్పందించాడు.  జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి రావడం ఒక భాగమని, అదే క్రమంలో తనపై కూడా అనేక రూమర్లు వచ్చాయన్నాడు.


ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఓడించి టైటిల్ సాధించడంపై సర్దార్ హర్షం వ్యక్తం చేశాడు. ఏ టోర్నమెంట్లోనైనా పాకిస్తాన్ పోరు అంటే అదొక పెద్ద ఛాలెంజ్ అని పేర్కొన్నాడు. లీగ్ల్లో పాకిస్తాన్ ఓడించిన భారత జట్టు.. అదే ఫైనల్లో కూడా పునరావృతం చేసి ఆ ట్రోఫీని మన జవాన్లకు అంకితమిచ్చిందన్నాడు. తాను ఎప్పుడూ ఫామ్ను పరీక్షించుకుంటూ ముందుకు వెళుతుంటానని, అదే సమయంలో యువకు ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడపడం ఆనందంగా ఉందన్నాడు. మరొకసారి కెప్టెన్ గా పగ్గాలు తనకు ఇచ్చినట్లైతే అత్యంత సంతోషంగా ఆ పదవిని స్వీకరిస్తానని సర్దార్ తెలిపాడు.

 

మరిన్ని వార్తలు