జింబాబ్వేకు మరో విజయం

10 Mar, 2016 18:59 IST|Sakshi
జింబాబ్వేకు మరో విజయం

నాగ్పూర్:వరల్డ్ టీ 20లో జింబాబ్వే మరో విజయాన్ని సాధించింది. గ్రూప్-బిలో స్కాట్లాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫయింగ్ మ్యాచ్లో జింబాబ్వే 11 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. జింబాబ్వే ఆదిలోనే సిబందా(4), కెప్టెన్ మసకద్జ(12)ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినా సీన్ విలియమ్స్ (53) ఆదుకున్నాడు.  ఆ తరువాత ముతాంబమి(19), వాలర్ (13) చిగుంబరా(20)లు ఓ మోస్తరుగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.
 

అనంతరం 148 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన స్కాట్లాండ్  42 పరుగులకే ఐదు వికెట్లను నష్టపోయింది.  అయితే ఆ తరువాత బెర్రింగ్టన్(36), మోమ్సేన్(31), డేవీ(24) దూకుడును ప్రదర్శించి జింబాబ్వే జట్టులో ఆందోళన రేకెత్తించారు. కాగా, స్వల్ప వ్యవధిలో స్కాట్లాండ్ వికెట్లను కోల్పోవడంతో 19.4 ఓవర్లలో 136 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. జింబాబ్వే బౌలర్లలో  వెల్టింగ్టన్ మసకద్జ నాలుగు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. గత మ్యాచ్ లో హాంకాంగ్ ను జింబాబ్వే ఓడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు