టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే

26 Jul, 2013 13:16 IST|Sakshi
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే

హరారే : సెల్ కాన్ కప్ ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జింబాబ్వే తన జట్టులో ఓ మార్పు చేసింది. పేసర్ బ్రియన్ విటోరిని జట్టులోకి తీసుకుంది. కాగా   తొలి వన్డే గెలిచిన ఊపులో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సంపాదించాలని కోహ్లి సేన చూస్తోంది.

ఊహించినట్లే జింబాబ్వే టూర్‌ను గెలుపుతో మొదలు పెట్టిన టీమిండియా.. ఇక దాన్ని కొనసాగించాలని ఆరాటపడుతోంది. హరారేలోనే జరిగే ఈ మ్యాచ్‌కు కూడా కోహ్లి సేన హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అనుభవం లేకపోయినా.. వన్డేల్లో ప్రపంచ నంబర్‌ స్థాయికి తగినట్లు తొలి వన్డే ఆడిన భారత్.. ఆడుతూపాడుతూ విజయం సాధించింది. మూడేళ్ల కిందట ఇదే జింబాబ్వే చేతిలో ఎదురైన చేదు అనుభవానికి తొలి ప్రతీకారం తీర్చుకుంది.

యువ జట్టుతో జింబాబ్వేలో అడుగుపెట్టిన కోహ్లి.. తానే ముందుండి టీమ్‌ను గెలిపించాడు. తొలి మ్యాచ్‌లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించలేదు. ఇదే ఆటతీరు తర్వాతి మ్యాచుల్లోనూ ప్రదర్శిస్తే చాలు.. హోమ్‌టీమ్‌ను సునాయాసంగా క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం టీమిండియాకు ఉంది. తొలి వన్డేలో సక్సెస్‌ కావడంతో.. రెండో మ్యాచ్‌కు కూడా అదే టీమ్‌తో బరిలోకి దిగనుంది కోహ్లి సేన. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన రాయుడు, జైదేవ్‌ ఉనద్కట్‌ కూడా అంచనాలకు తగినట్లు రాణించారు.

యువ జట్టుతో జింబాబ్వేలో అడుగుపెట్టిన కోహ్లి.. తానే ముందుండి టీమ్‌ను గెలిపించాడు. తొలి మ్యాచ్‌లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించలేదు. ఇదే ఆటతీరు తర్వాతి మ్యాచుల్లోనూ ప్రదర్శిస్తే చాలు.. హోమ్‌ టీమ్‌ను సునాయాసంగా క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం టీమిండియాకు ఉంది. తొలి వన్డేలో సక్సెస్‌ కావడంతో.. రెండో మ్యాచ్‌కు కూడా అదే టీమ్‌తో కోహ్లి సేన బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన రాయుడు, జైదేవ్‌ ఉనద్కట్‌ కూడా అంచనాలకు తగినట్లు రాణించారు.

అటు సొంతగడ్డపై ఆడుతున్నా.. జింబాబ్వే మాత్రం తడబడుతూనే ఉంది. తొలి మ్యాచ్‌లో కాస్త పోరాడినా ఓటమి మాత్రం తప్పించుకోలేకపోయింది. ఓపెనర్‌ సికందర్‌ రజా హాఫ్‌ సెంచరీతో గౌరవప్రదమైన స్కోరు సాధించినా.. బౌలర్లు దాన్ని డిఫెండ్‌ చేయడంలో విఫలమయ్యారు. దీంతో రెండో వన్డేలోనైనా గెలిచి సిరీస్‌ సమం చేయాలని ఆరాటపడుతోంది.
 

మరిన్ని వార్తలు