105 ఏళ్ల పాంబన్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఐఐటీ బృందం

14 Jun, 2020 07:36 IST|Sakshi
బ్రిడ్జిపై సెన్సర్‌ పరికరాలను అమర్చుతున్న ఐఐటీ బృందం

చెన్నై: 105 ఏళ్ల నాటి పాంబన్‌ రైల్వే బ్రిడ్జి స్థిరత్వాన్ని పరిశీలించేందుకు చెన్నై ఐఐటీ బృందం అక్కడికి చేరుకుంది. ఇందుకోసం వంతెనపై 100 చోట్ల సెన్సర్‌ పరికరాలను అమర్చే పనులలో నిమగ్నమయ్యారు. రామనాథపురం జిల్లాతో రామేశ్వరం దీవిని అనుసంధానించేందుకు సముద్రంలో ఏర్పాటైన పాంబన్‌ రైల్వే బ్రిడ్జ్‌ ముఖ్యపాత్ర వహిస్తోంది. 105 ఏళ్లు దాటినా రైల్వే బ్రిడ్జ్‌పై రైళ్ల రాకపోకలు ఇంకా సాగుతున్నాయి. రైల్వే వంతెన మధ్యభాగంలో ఉన్న హ్యాంగింగ్‌ బ్రిడ్జ్‌ని రైల్వే శాఖ ద్వారా మెయింటైన్‌ చేస్తున్నారు. ఇలా ఉండగా పాంబన్‌ సముద్రంలో కొత్త రైల్వే వంతెన నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపి రూ.250 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో గత ఫిబ్రవరి నెల పాంబన్‌ కొత్త రైల్వే బ్రిడ్జ్‌ పనులు ప్రారంభమయ్యాయి. చదవండి: పోలీస్‌ కమిషనర్ ‌మానవీయత 

ఈలోపున కరోనా వైరస్‌ వ్యాపించడంతో దీని నియంత్రణకు అమలు చేసిన లాక్‌డౌన్‌ కారణంగా పనులను నిలిపి వేశారు. ఈ స్థితిలో పాంబన్‌ సముద్రంలోని రైల్వే వంతెన మధ్యభాగంలో ఉన్న హ్యాంగింగ్‌ బ్రిడ్జ్‌ స్థిరత్వాన్ని గుర్తించేందుకు వీలుగా రైళ్లు వెళ్లే సమయంలో ఏర్పడే ప్రకంపనల ప్రభావం, ఉప్పు గాలులతో ఇనుప రాడ్‌లు, స్థంభాలలో ఏదైనా లోపాలు ఏర్పడ్డాయా అనే విషయంపై పరిశీలన జరిపేందుకు గత మూడు రోజులుగా చెన్నై ఐఐటీ బృందం ఈ వంతెనపై సెన్సర్‌ పరికరాలను అమర్చే పనులలో నిమగ్నమైంది. దీని గురించి ఐఐటీ ప్రతినిధి మాట్లాడుతూ.. పాంబన్‌ రైల్వేబ్రిడ్జ్‌ స్థిరత్వాన్ని గుర్తించేందుకు ఈ సెన్సర్‌ పరికరాలను బ్రిడ్జ్‌పై 100 చోట్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులలో గత మూడు రోజులుగా 10మందితో ఈ పనులు చేపడుతున్నామని, ఈ పనులన్నీ పూర్తయ్యేందుకు నెల రోజులు పడుతుందని తెలిపారు.

చదవండి: ప్రముఖ ఛాయాగ్రాహకుడు బి. కణ్ణన్‌ కన్నుమూత 

మరిన్ని వార్తలు