చెత్తకుప్పలో రూ.5 కోట్ల మరకతలింగం

17 May, 2019 12:05 IST|Sakshi
చెత్త కుప్పలో లభ్యమైన మరకతలింగం

రెండేళ్ల క్రితం చోరీకి గురైన మరకతలింగం

విగ్రహాల చోరీ నియంత్రణ ఐజీ విచారణ

తిరువణ్ణామలై: వేట్టవలంలోని మనోర్‌మణి అమ్మల్‌ ఆలయంలో రెండేళ్ల క్రితం చోరీకి గురైన మరకతలింగం చెత్త కుప్పలో లభ్యమైన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా వేట్టవలంలోని జమీన్‌ కోట కొండపై శ్రీమనోర్‌మణి అమ్మన్‌ ఆలయం ఉంది. ఈ ఆలయంలో రూ.5 కోట్ల విలువైన మరకతలింగం, అమ్మన్‌ వెండి కిరీటం(కిలో), వెండి పాదం, వడ్డానం, మరకతలింగం పెట్టేందుకు ఉపయోగించే వెండి నాగభరణం, నాలుగు గ్రాముల బంగారు తాళిబొట్టు 2017లో చోరీకి గురయ్యాయి. దీనిపై వెట్టవలం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి అడిషనల్‌ ఎస్పీ రంగరాజన్‌ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.

విచారణలో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో విగ్రహాల చోరీ నియంత్రణ విభాగానికి కేసును మార్పుచేశారు. దీంతో అడిషనల్‌ ఎస్పీ మాధవన్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వేట్టవలం జమీన్‌కోట వద్ద ఉన్న ఓ చెత్త కుప్పలో చోరీకి గురైన మరకతలింగం ఉండడంతో గుర్తించిన కార్మికుడు పచ్చయప్పన్‌ పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు అక్కడికి వచ్చి విగ్రహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాత ఫొటోలతో పరిశీలించిన తర్వాత ఆలయ అర్చకుడు, జమీన్‌ మహేంద్రన్‌ను రప్పించారు. వారు రెండేళ్ల క్రితం చోరీకి గురైన మరకతలింగంగా గుర్తించారు. వెంటనే విగ్రహాల నియంత్రణ విభాగం ఐజీ పొన్‌ మాణిక్యవేల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వేట్టవలం చేరుకొని జమీన్‌ కోట వద్ద ఉన్న చెత్త కుప్ప, ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏడడుగులు కాదు.. ప్రమాణ స్వీకారం

బ్యానర్‌ చిరిగిందని ఆగిన పెళ్లి

నిర్మాణంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ కూలి ముగ్గురి మృతి

మదురైలో ఎన్‌ఐఏ సోదాలు

వివాహ ‘బంధం’ ...వింత ఆచారం

ఉందామా, వెళ్లిపోదామా? 

ఈజీ మైండ్‌ ఇట్టే ముంచేసింది..

పేరుమోసిన రౌడీషీటర్ ఎన్‌కౌంటర్

గాయకుడు రఘు, డ్యాన్సర్‌ మయూరి విడాకులు

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రండి..

భానుప్రియపై చర్యలు తీసుకోవాలి

వాళ్లు వంట చేస్తే మా పిల్లలు తినరు..

టిక్‌టాక్‌ చేస్తూ విషం తాగేసింది...

చిన్నమ్మ విడుదల వీలుకాదు

క్రైంబ్రాంచ్‌ పోలీసుల ఎదుటకు విశాల్‌

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

ఉచిత మెట్రో ప్రయాణాన్ని సమర్థిస్తారా?

పోలీసులూ..తస్మాత్‌ జాగ్రత్త

ప్రియుడి హత్య.. పరువు హత్య కానేకాదు..

యూఎస్‌లో కారు ప్రమాదం, టెకీ, కూతురు మృతి

ఏ తల్లికి ఈ పరిస్థితి రాకూడదు: సినీనటి

భర్త అంత్యక్రియలపై ఇద్దరు భార్యల బాహాబాహీ

క్లాప్‌ కొట్టి డైలాగ్‌ చెప్పిన మాజీ సీఎం

వర్షానికి కారుతున్న మెట్రో స్టేషన్‌

కాలి బూడిదైన తెలంగాణ ఆర్టీసీ బస్సు

ఇకపై తమిళనాడులో 24 గంటల షాపింగ్‌

ఇద్దరు ప్రియురాళ్లను ఒకేసారి పెళ్లాడాడు..

బెంగళూరులో జర్నలిస్టు ఆత్మహత్య

పడక గదిలో కెమెరా.. భార్యపై అనుమానం

మెరీనా తీరంలో బైక్‌ రేసింగ్‌.. ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమా ప్రారంభం

‘సంపూ’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే!

రెక్కల సివంగి

ఏడేళ్లుగా ఇదే ఫిట్‌నెస్‌తో ఉన్నా!

ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్‌ తేజ్‌!

‘ఆమె నరకంలో ఉంది.. సాయం చేయలేకపోతున్నాం’