ఎమ్మెల్యే కటౌట్‌కు చెప్పులహారం 

18 Nov, 2018 20:33 IST|Sakshi
ఆనంద్‌సింగ్‌ కటౌట్‌కు  చెప్పుల హారం వేసిన దృశ్యం 

హొసపేటె : హొసపేటె కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ కటౌట్‌కు గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులహారం వేయడం నగరంలో చర్చనీయంగా మారింది. హగరిబొమ్మనహళ్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తన స్వంత కార్యాలయాన్ని ప్రారంభించారు. తన పొరుగు నియోజకవర్గమైన హగరిబొమ్మనహళ్లిలో కూడా పట్టు పెంచుకోవాలని ఆయన సన్నామాలు చేస్తున్నారు. సేవలు అందించేందుకు నడుం బిగించారు. దీంతో హగరిబొమ్మనహళ్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భీమా నాయక్‌ ఆగ్రహంగా ఉన్నారు.

ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఈ తరుణంలో ఆనంద్‌సింగ్‌ కటౌట్‌కు అల్లరి మూకలు చెప్పులహారం వేయడం కలకలం రేపింది. పొరుగు నియోజకవర్గంలో జోక్యం వద్దని గతంలోనే సిద్ధరామయ్య నచ్చచెప్పినా ఆనంద్‌సింగ్‌ పంథాను మార్చుకోలేదని సమాచారం.  

మరిన్ని వార్తలు