కాంగ్రెస్‌తో పోల్చద్దు

3 Aug, 2014 23:41 IST|Sakshi
కాంగ్రెస్‌తో పోల్చద్దు

సాక్షి, చెన్నై: కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వాన్ని పోల్చుకోవద్దంటూ శ్రీలంక ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ హెచ్చరించారు. ఆయన ఆదివారం కమలాలయ సందర్శనకు రావడంతో కార్యకర్తలు సందడి చేశారు. రాష్ట్రంలోని ఇతర పార్టీలకు భిన్నంగా బీజేపీ ఐదేళ్ల క్రితం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఏడాదిలో ఓ రోజు పార్టీ కార్యాలయాన్ని సందర్శించే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి వినూత్న స్పందన వస్తోంది. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. శనివా రం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈ సందర్శన వేడుక కమలాలయంలో జరిగింది. అందరి కన్నా భిన్నంగా అక్క డ ఏర్పాట్లు చేశారు.
 
 పార్టీ మైకులు, స్పీక ర్లు, ప్రసంగాలకు చోటు ఇవ్వకుండా, టీ నగర్‌లోని పార్టీ కార్యాలయ పరిసరాల ను ఓ పెళ్లి వేడుకను తలపించే విధంగా తీర్చిదిద్దారు. తరలి వచ్చిన కార్యకర్తలను పార్టీ అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, నాయకులు ఇలగణేషన్, తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, మోహన్ రాజులు, హెచ్ రాజా తదితరులు ప్రవేశ మార్గంలో స్వాగతం పలకడం విశేషం.విందులతో సందడి: పార్టీ కార్యాలయం లో విందులు, సంగీత విభావరిలతో కార్యకర్తలు, నాయకులు సందడి చేశా రు. దేశ భక్తి గీతాల సంగీత విభావరి, మోడీ వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. అలాగే, గ్రామీణ సం స్కృతి ఉట్టి పడే రీతిలో దుకాణాలు సైతం ఏర్పాటు చేయడం విశేషం. 20 రకాల వంటకాలను కార్యకర్తలకు విందుగా అందజేశారు. రాత్రి పొద్దుపోయే వరకు కుటుంబంతో కలసి పార్టీ కార్యకర్తలు ఆనందాన్ని తమ నేతలతో పంచుకున్నారు. కొందరు నాయకులు, కార్యకర్తలు తమ సమస్యల్ని, తమ ప్రాంతాల్లోని సమస్యల్ని వినతి పత్రాల రూపంలో తెలియజేశారు.
 
 అండగా ఉంటాం: కార్యకర్తలతో మాట్లాడిన పొన్ రాధాకృష్ణన్ అందరికీ అం డగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఇది వరకు కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, ఆ ప్రభుత్వంతో బీజేపీని పోల్చుకోవద్దంటూ శ్రీలంకను హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జయలలితను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించడాన్ని తీవ్రంగా ఖండిచారు. శ్రీలంక క్షమాపణలు చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే, తమ వెబ్ సైట్లోకి అవి ఎలా వచ్చాయో తెలియవంటూ శ్రీలంక పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
 
 ఈ విషయంలో మాత్రం తాము శ్రీలంకతో ఏకీభవించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాగించిన ఆటలు తమ ప్రభుత్వ హయూంలోనూ కొనసాగించే యత్నంలో శ్రీలంక ఉన్నట్టుందని ధ్వజమెత్తారు. తమిళ జాలర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతానని, మరో రెండు మూడు రోజుల్లో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తో భేటీకి చర్యలు తీసుకుంటానంటూ ఈసందర్భంగా ఓ కార్యకర్త సంధించిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడం విశేషం.
 

>
మరిన్ని వార్తలు