సేకరిస్తే..అదే ‘పది’వేలు!

9 Feb, 2019 01:19 IST|Sakshi

కాళేశ్వరం నీళ్లతో ఎస్సారెస్పీ ఆయకట్టు పారాలంటే భూసేకరణే కీలకం

వరద కాల్వ, కాళేశ్వరం, ఎస్సారెస్పీ స్టేజ్‌–2లో 10,983 ఎకరాల భూమి అవసరం

18 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు భూసేకరణకు చొరవ చూపాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింది ఆయకట్టుకు వచ్చే వానాకాలానికి పూర్తి స్థాయిలో నీరు పారించాలంటే ప్రాజెక్టు పరిధిలో భూసేకరణే అత్యంత కీలకం కానుంది. ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిని పారించే ఎస్సారెస్పీ స్టేజ్‌–2, ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్‌ఎఫ్‌సీ), కాళేశ్వరంల పరిధిలోని కాల్వల పనలకు ఏకంగా పదివేల ఎకరాల భూమిని సేకరణ చేస్తే కానీ నీటిని తరలించడం సాధ్యంకాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ చూపి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసేలా సహకరించాలని గరువారం రాత్రి ఎస్సారెస్పీ ప్రాజెక్టుపై జరిపిన సమీక్ష సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

సేకరిస్తేనే సాగయ్యేది..
ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద మొత్తంగా 14.40లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఇందులో 6లక్షల ఎకరాలకు మించి నీరందడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుమారు రూ.2వేల కోట్లతో కాల్వల ఆధునికీకరణ చేపట్టింది. కాల్వల సామరŠాధ్యన్ని పెంచారు. దీనికి తోడు ఎస్సారెస్పీ దిగువ తీరం నుంచి 20 టీఎంసీల వరద నీటిని వినియోగించుకుంటూ 2.20 లక్షల ఎకరా లకు నీటినిచ్చేలా ఇందిరమ్మ వరద కాల్వని చేపట్టారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టు పరిధిలో మార్పులు చోటుచేసుకొని దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని 2లక్షల ఎకరాల మేర ఆయ కట్టును వరద కాల్వ పరిధిలోకి తెచ్చారు. దేవాదుల కింద నిర్ణయించిన ఆయకట్టుకు కొత్తగా వరద కాల్వ ద్వారా నీటిని అందించాలంటే 3.3 కిలోమీటర్ల అదనపు టన్నెల్‌ నిర్మాణంతో పాటు 48 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్‌ తవ్వాల్సి ఉంది. దీంతో పాటే మిడ్‌మానేరు రిజర్వాయర్‌ కెనాల్‌ తొలి నుంచి 36 కిలోమీటర్ల వరకు కెనాల్‌ సామర్థ్యాన్ని 2,600 క్యూసెక్కుల నుంచి 4,200 క్యూసెక్కులకు పెంచా లని ప్రతిపాదించారు. దీనికి తోడు గౌరవెల్లి రిజర్వా యర్‌ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీల నుంచి 8,23 టీఎంసీలకు, గండిపల్లి సామర్థ్యాన్ని 0.15 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి పెంచారు. దీంతో వరద కాల్వ కింద భూసేకరణ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ 5,978 ఎకరాల మేర సేకరణ చేయాల్సి ఉందని ఇటీవలి సమీక్షలో సీఎంకు ఇంజనీర్లు నివే దించారు. పది నియోజకవర్గాల పరిధిలో భూసేక రణ చేయాల్సి ఉండగా, ఇందులో అధికంగా హుస్నాబాద్‌లో 3,943 ఎకరాలు, స్టేషన్‌ ఘణ పూర్‌లో 863, జనగామలో 498 ఎకరాలు ఉంటుం దన్నారు.

వచ్చే వానాకాలానికి గౌరవెల్లి రిజర్వా యర్‌ వరకు 80వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణ యించారు. ఈ దృష్ట్యా మానుకొండూరు, హుస్నా బాద్, సిద్ధిపేట, చొప్పదండి నియోజక వర్గాల్లో భూసేకరణ జరిగేలా చూడాలని సీఎం స్థానిక ఎమ్మెల్యేలకు ఆదేశించారు.ఇక ఎస్సారెస్పీ స్టేజ్‌– 2లో 3.92లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఇవ్వాల్సి ఉండగా, ఇక్కడ కేవలం 135 ఎకరాల సేకరణ అవసరం ఉంది. దీన్ని పరిష్కారించేలా చూడాలని డోర్నకల్, పాలేరు, సూర్యాపేట, తుంగతుర్తి నియో జకవర్గ ఎమ్మెల్యేలకు సూచించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టును అనుసంధా నిస్తున్న క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న 4,869 ఎకరాల సేకరణ సైతం అత్యంత కీలకంగా మారుతోంది. ఇందులో సిద్ధిపేటలో 1,146 ఎక రాలు, సిరిసిల్లలో 855 ఎకరాలు, వేముల వాడలో 685 ఎకరాలు,, గజ్వేల్‌లో 595 ఎకరాల మేర చేయా ల్సి ఉంది. దీన్ని వేగిరపరచాలని సీఎం ఆదేశిం చారు. ఒకటి, రెండు నెలల్లో ఈ మొత్తం భూసేకరణ చేస్తేనే జూన్‌ నాటికి ఎస్సారెస్పీ కింది 14.40లక్షల ఎకరాలకు నీటిని తరలించే ఆస్కారం ఏర్పడనుంది.  

మరిన్ని వార్తలు