సూర్యాపేట కలెక్టరేట్‌పై ముగిసిన వాదనలు

8 Aug, 2018 03:56 IST|Sakshi

తీర్పు వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌: కొందరు ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్‌ నిర్మాణానికి ప్రభుత్వం భూ సేకరణ చేస్తోందంటూ హైకోర్టులో దాఖలైన పిల్‌పై మంగళవారం వాదనలు ముగిశాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. సూర్యాపేటలో ప్రభుత్వ భూమి ఉన్నా..పట్టణానికి దూరంగా కుడకుడ, బీబీగూడెం గ్రామాల పరిధిలోని ప్రైవేటు భూముల్లో కలెక్టరేట్‌ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీహెచ్‌.రాజేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై మంత్రి జగదీశ్‌రెడ్డికి చెందిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రైవేట్‌ భూముల్లో కలెక్టరేట్‌ను నిర్మిస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఇరువురి వ్యాజ్యాలపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు