తెలంగాణ ఉద్యమ వేదిక దీక్ష భగ్నం

25 Nov, 2016 03:04 IST|Sakshi
ఇందిరా పార్క్ వద్ద చెరుకు సుధాకర్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

డాక్టర్ చెరుకు సుధాకర్ అరెస్టు

 హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతా రాహిత్య పాలనను నిరసిస్తూ తెలంగాణ ఉద్యమవేదిక చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఇందిరాపార్కు వద్ద ఏర్పాటుచేసిన దీక్షలో పాల్గొనడానికి వస్తున్న తెలంగాణ ఉద్యమ వేదిక వ్యవస్థాప కుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సుధాకర్  కారులో దీక్షా శిబిరం వద్దకు వస్తుండగా పోలీసులు కాపుకాసి, బండ మైసమ్మనగర్ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకుని పొలీసుస్టేషన్‌కు తరలించారు. దీక్షా శిబిరం వద్ద ఉన్న ఉద్యమ నాయకులు, కార్యకర్తలు సుధాకర్ అరెస్టును అడ్డుకోవ డానికి బయలుదేరగా పోలీసులు వారినీ అరెస్టు చేశారు. అరెస్టరుునవారిలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, చెరుకు లక్ష్మక్క, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

బంగ్లాల తెలంగాణ
అంతకు ముందు దీక్షా శిబిరం వద్ద శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నివాస సమూహం 50 వేల చదరపు అడుగులేనని, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ డబుల్ బెడ్ రూం ఇల్లు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చిన్న ఇంట్లో నివసిస్తున్నారని, కానీ, రాష్ర్ట సీఎం కేసీఆర్ లక్ష చదరపు అడుగులతో కోట్ల రూపా యల దుబారాతో ఇంద్ర భవనం నిర్మించు కున్నారని విమర్శించారు. సీఎంది బంగారు తెలంగాణ కాదు బంగ్లాల తెలంగాణ అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వేదిక నాయకులు బత్తుల సిద్ధేశ్వర్, బోర సుభాష్, టీపీఎఫ్ అధ్యక్షుడు నలమాస శ్రీనివాస్,  న్యూడెమోక్రసీ నాయకురాలు ఝాన్సీ, ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు