ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి | Sakshi
Sakshi News home page

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి

Published Fri, Nov 25 2016 3:00 AM

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి - Sakshi

మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్

ఉట్నూర్ : ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేయూలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని, పార్టీ బలోపేతానికి కలిసి వచ్చే వారందరితో పని చేస్తామని అన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపేతంపై అధి నాయకత్వం దృష్టి సారించిందని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పార్టీ పటిష్టత కోసం నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల ఒకటి వరకు మండల కమిటీలు, పదో తేదీ వరకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసేలా మండల నాయకత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

నార్నూర్ మండలంలో కొత్తగా ఏర్పడిన గాదిగూడ మండల కమిటీ ఎన్నిక బాధ్యతను నార్నూర్ మండల పార్టీ అధ్యక్షుడికి, ఖానాపూర్ నియోజకవర్గంలో కమిటీల నియూమక బాధ్యతను పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తొడసం నాగోరావ్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయూల్లో మార్పులు యువత వల్లే సాధ్యమవుతుందని, పార్టీ అధినేత వైఎస్.జగన్ యువతకు పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తిలక్‌రావ్, కార్యదర్శి రమేశ్, భోథ్ నియోజకవర్గం కార్యనిర్వాహక సభ్యుడు ప్రవీణ్‌నాయక్, నార్నూర్, ఉట్నూర్ మండలాల అధ్యక్షులు యూసుఫ్‌ఖాన్, ముజాయిద్, ఉట్నూర్ మండల ప్రధాన కార్యదర్శి గణేష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు హకీమ్, యూత్ అధ్యక్షుడు మోసిన్, రాష్ట్ర, జిల్లా నాయకులు షెక్ జిలానీ, హారీఫ్, సందీప్‌కుమార్, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement